‘ఆదిపురుష్‌’ సినిమాతో మాకేం సంబంధం లేదు : ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా

-

ఇటు టీజర్ రిలీజ్ అవ్వడం ఆలస్యం ఆదిపురుష్ టీమ్ కు సమస్యలు షురూ అయ్యాయి. ఓవైపు బీజేపీ నాయకులు ఈ సినిమా డైరెక్టర్ పై విరుచుకుపడుతోంటే.. మరోవైపు కొందరు వ్యక్తులు, సంస్థలు జాగ్రత్తపడుతున్నాయి. ఎక్కడ తమకు చిక్కులు వచ్చి పడతాయనే భయంతో ముందుగా అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే వీఎఫ్‌ఎక్స్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

’’ ‘ఆదిపురుష్‌’ వర్క్‌లో మేము భాగం కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన సీజీ లేదా ఏ ఇతర స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను మేము చేయలేదు’’ అని ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా సంస్థ పేర్కొంది. ఆదిపురుష్ సినిమా టీజర్‌ విడుదల సమయంలో ఓంరౌత్‌..  వీఎఫ్‌ఎక్స్‌ వాలా అనే ఖాతాను ట్యాగ్‌ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు ఇదే పేజీని ట్యాగ్ చేస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఇంకాస్త బాగా వర్క్‌ చేసి ఉండొచ్చు కదా’ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు టీమ్ తాజా ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌కు చెందిన సంస్థనే ఈ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌ వాలా.

Read more RELATED
Recommended to you

Exit mobile version