నేను బతికే ఉన్నా: టీడీపీ నేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో వరుసగా అభ్యంతరకర పోస్టింగ్‌లు ప్రత్యక్షమయ్యాయి. జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మృతి చెందినట్లు సోషల్ మీడియా‌లో పోస్టింగ్‌లు పెట్టారు. అయితే ఆ పోస్టులు నమ్మవద్దని తాను బ్రతికే ఉన్నా అంటూ ముళ్ళపూడి బాపిరాజు మరో పోస్టింగ్ పోస్ట్ చేశారు. ఇలా తప్పుడు పోస్టింగ్‌లు పెట్టినవారిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కూడా సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టింగ్‌లు షేర్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ దాడులు సాగుతున్నాయి. ఒక సామాజిక మాధ్యమంలో చింతమనేని పేరు మీద ఆగంతకులు అకౌంట్ ప్రారంభించారు. చింతమనేని ఇంట్లో జరిగిన వివాదాన్ని కూడా వదల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీ దెందులూరు మండల అధ్యక్షుడు లావేటి శ్రీనివాస్ పెదపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ పోస్టింగులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన కొందరిపనేనని అనుమానం వ్యక్తంచేశారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి అలజడికి పోలీసులు చెక్ పెడతారేమో చూడాలి.