రోజుకు ఆరుసార్లు స్నానం చేస్తుందని భార్యకు విడాకులు..!

-

అపరిశుభ్రంగా ఉంటున్నారని.. రోజుల కొద్ది స్నానం చేయకుండా ఉంటున్నారని విడాకులు అడిగిన ఉదంతాలు ఇప్పటికే చూశాం. కానీ రోజుకు ఆరు సార్లు స్నానం చేయడం.. అతి పరిశుభ్రత ఆ కాపురంలో చిచ్చుపెట్టాయి. భార్య అతి పరిశుభ్రతతో విసిగిపోయిన భర్త విడాకులు ఇచ్చేందుకు రెడి అయ్యాడు. ఈ ఘటన బెంగళూర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూర్ కు టీఆర్ నగర్ లో నివసిస్తున్న దంపతులకు 2009లో వివాహమైంది. బెంగళూర్ రాకముందు కొంత కాలం లండన్ లో నివాసం ఉన్నారు. అప్పటి నుంచే భార్యకు అతిపరిశుభ్రత ఎక్కువైంది. మొదటి కాన్పు జరిగిన తర్వాత ఇది తారాస్థాయికి చేరింది. భర్త బూట్లను, బట్టలను, ఫోన్లను తరుచూ శుభ్రం చేయమనేది. ఆ తరువాత కొద్ది కాలానికి భారత్ తిరిగి వచ్చినా .. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన భర్త, భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా  ఆమె ఓసీడి( అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ )లో బాధపడుతుందని తెలిపాడు.

డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నా.. రెండో కాన్పు తర్వాత నుంచి మళ్లీ అతి పరిశుభ్రతతో భర్తకు చుక్కలు చూపించేది. గతేడాడి లాక్ డౌన్ లో అతి పరిశుభ్రత తారాస్థాయికి చేరింది. భర్త ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను సబ్బుతో పరిశుభ్రం చేసిది. తరుచూ ఇంట్లో వస్తువును శానిటైజ్ చేసేది.. ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే స్నానం చేసిన సబ్చును కూడా పరిశుభ్రం చేసేదాకా చేరింది. చివరకు రోజుకు ఆరు సార్లు స్నానం చేయడంతో విసిగిపోయిన భర్త బెంగళూర్ ఆర్ టీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.. పోలీసులు ఈ కేసును ఉమన్​ హెల్ప్​లైన్​ సెంటర్​కు బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version