వామ్మో, ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలకి కరోనా

-

కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా వాస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందు సామాన్యులకే పరిమితం అయిన ఈ కేసులు ఇప్పుడు అందరినీ ఒక చుట్టుచుట్టేస్తోంది. ఇప్పటికే మన తెలుగు రాష్టాల్లో దాదాపు పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఈ కరోనా బారిన పడ్డారు కూడా. అయితే తాజాగా ఏకంగా ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం సంచలనంగా మారింది. ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీ కాంత్ సింగ్‌తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.

ఈ రోజు నుంచి ఒడిశా అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇక తనకు కరోనా సోకిందని, అందుకే భువనేశ్వర్‌ లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు ఉంటే కానున కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఒడిశాలో ఇప్పటి వరకు 9 మంది మంత్రులు సహా 50 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. దాదాపు చాలా మందికి నయం అయింది కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version