ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన రైల్వే !

-

ప్రయాణికుల నడ్డి విరిచేందుకు సిద్దమయింది ఇండియన్ రైల్వే, ఇక మీదట విమాన ప్రయాణికుల్లాగే రైల్వే ప్రయాణికులు కూడా యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రైలు టికెట్ ధరలతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. అయితే టికెట్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేసింది.

త్వరలో కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపనున్నట్టు చెబుతున్నారు. ఐతే ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే టికెట్‌ ధరకు అదనంగా ఈ యూజర్‌ ఛార్జీలు వసూలు చేయనున్నట్టు చెబుతున్నారు. సెకండ్ క్లాస్ కి, ఏసీకి వేర్వేరుగా యూజర్‌ ఛార్జీలు ఉంబోతున్నాయి. తరగతులను బట్టి రూ.10 నుంచి రూ.35 మధ్య ఈ ధర ఉండనుంది. ప్రస్తుతం మన దేశంలో 7వేల రైల్వే స్టేషన్లు ఉండగా వీటిలో సుమారు 700 నుంచి 1000 స్టేషన్లలో యూజర్ ఛార్జీల పద్ధతిని ప్రవేశపెట్టనున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version