మసీదులో సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులపై రాళ్లు, చెప్పులతో దాడి

-

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో ఓ వర్గానికి చెందిన కొందరు మూకలు మరోసారి రెచ్చిపోయాయి. మసీదులో సర్వే చేసేందుకు షాహి జామా మసీదుకు చేరుకున్న సర్వే బృందంపై స్థానికులు రాళ్లు, చెప్పులతో దాడులు జరిపారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. మసీదును అక్రమంగా టెంపుల్ స్థానంలో నిర్మించారని అందుకే అక్కడ సర్వే చేసేందుకు అధికారులు వెళ్లారు.

అధికారులు సర్వేకు వస్తున్నారని ముందే సమాచారం అందుకున్న అక్కడి స్థానికులు రెచ్చిపోయారు. సర్వే చేసే బృందాన్ని మసీదులోని రాకుండా అడ్డుపడ్డారు. రాళ్లు, చెప్పులు విసురుతూ వారిపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అక్కడ రాళ్లు రువ్వేలా స్థానికులను రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version