ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తోంది. మిషన్‌ను కట్టర్‌తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్. మిషన్ పార్ట్‌లను బయటకు పంపిస్తున్నారు సహాయకులు. ఈ ప్రక్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్సు ఉంది.

14 రోజులు శ్రమించి ముక్కలైన టీబీఎం మిషన్ పార్ట్స్ బయటకు తీసుకు వచ్చారు అధికారులు. అయితే ఇప్పటి వరకు రెష్య్కూ టీం శ్రమించింది మృత దేహాలకోసం కాదా? మిషన్ బయటకు తీసుకువచ్చేందుకా? అంటూ విమర్శలు వస్తున్నాయి. 14 రోజులు అంటే మృత దేహాలు ఉండవని ఫిక్స్ అయిపోయి.. విషయం లైట్ తీసుకున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతి పక్షాలు. లోపల టన్నెల్ పనులు చేసుకుంటూ బయట మాత్రం మృత దేహాలు తీస్తున్నట్లు ప్రచారమా? జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.