బీర్ల ఐలయ్యపై తిరుగబడ్డ రైతు..నా పొలం ఎండిపోయిందంటూ !

-

బీర్ల ఐలయ్యపై తిరుగబడ్డాడు రైతు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నా బావమరిది.. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను అంటూ రెచ్చిపోయాడు. నా పొలం ఎండిపోయినా కూడా నా బావమరిది పట్టించుకోవట్లేదు, నీళ్లు వదలట్లేదని మండిపడ్డాడు సదరు రైతు.

farmer

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన రైతు ఎమ్మ బాలరాజు తన 6 ఎకరాల పొలం ఎండిపోయిందని, లో ఓల్టేజితో మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మేన బావమరిది అయిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కనీసం వచ్చి చూసిపోలేదని, ఎన్నికలకు ముందు కాళేశ్వరం నీళ్ళు తెస్తానని హామీ ఇచ్చి, గెలిచాక ఒక్క చుక్క నీళ్ళు కూడా తీసుకురాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news