భారీగా పడిపోయిన ఆయిల్ ధరలు… మన దేశం పరిస్థితి ఏంటీ…?

-

కరోనా దెబ్బకు ఆయిల్ ధరలు రోజు రోజుకి పడిపోతున్నాయి. కోలుకుంటాయి అనుకున్న చమురు ధరలు ఇప్పుడు రోజు రోజుకి పతనం కావడం ఆందోళన కలిగిస్తుంది. దశాబ్దాల నాటి కిందకు చమురు ధరలు పడిపోతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులను అసలు వాడటం లేదు. దీంతో ధరలు భారీగా పతనం అవుతున్నాయి. బుధవారం రికార్డు స్థాయిలో బ్యారెల్‌కు 16డాలర్లకు పడిపోయింది.

బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర గత తగ్గింపుతో పోలిస్తే 24శాతం పడిపోయి 16డాలర్ల వద్దకు చేరుకుంది. డబ్ల్యూటీఐ(వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్) ధర 11.42 డాలర్లకు దిగజారింది. 1999 తరువాత బ్రెంట్‌ క్రూడాయిల్‌ అత్యల్ప ధరకు పడిపోవడం ఇదే మొదటి సారి. జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీనితో చమురుకు డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోయింది.

పలు దేశాలు తమ వద్ద నిల్వ చేసుకునే సామర్ధ్యం లేక దిగుమతి చేసుకోవడం ఆపేశాయి. ఉత్పత్తికి సంబంధించి ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించుకోవాలి అని భావిస్తున్నాయి. లేకపోతే మాత్రం ధరలు ఇంకా పడిపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు భారీగా పడిపోతు వస్తున్నాయి. మరి మన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news