కరోనా పుట్టుకకు కారణమైన చైనాపై ప్రపంచంలోని అనేక దేశాలు మండిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐతే చాలా అగ్రహంగా ఉన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న చైనాలో మరో దారుణం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 18 మంది మరణించగా, మరో 189 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చైనాలోని బెజియాంగ్ ప్రావిన్సులోని వెన్లింగ్ నగర జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ పేలుడులో పెద్ద సంఖ్యలో ఇళ్లు, ఫ్యాక్టరీ వర్క్‌షాప్ భవనం కూలిపోయాయి. ఈ పేలుడులో పలువురి శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్ ఇంజన్లతో వాటిని అదుపులోకి తీసుకొచ్చారు.