ఇంగ్లీష్ భాషలోని “ఓకే” వెనక ఉన్నపెద్ద చరిత్రే ఉంది.. తవ్వి తీస్తే వెలువడ్డ విషయాలివే.

-

ఒక అంగీకారం జరిగినపుడు అవతలి వ్యక్తి నుండి ఒప్పుకోలుగా వచ్చే రెండక్షరాల మాటకి చాలా ప్రాధ్యాన్యం ఉందని మీకు తెలుసా? ఆంగ్లంలో ఆ రెండక్షరాల పదం ఎలా పుట్టిందనే విషయమై విభిన్న వాదనలున్నాయని మీకు గమనించారా? మన నిత్య జీవితంలో ఎక్కువగా మాట్లాడుకునే పదాల్లో మొదటి స్థానంలో ఉండే ఓకే వెనక పెద్ద కథే ఉందని ఎంత మందికి తెలుసు. ఆంగ్లంలో ఏ పదానికి లేనంత చరిత్ర ఓకేకి ఎలా వచ్చింది వంటి విషయాలన్నీ మీకోసం.

ఈ ఓకే అనే పదం 182 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ఓకే అంటే ఓల్లా కల్లా అని అర్థం. ఇది గ్రీకు పదం. ఇది అమెరికన్ జర్నలిస్ట్ చార్లెస్ గోర్డాన్ గ్రీన్ కార్యాలయంతో ప్రారంభమైంది. 1839వ సంవత్సరంలో రచయిత ఉద్దేశ్యపూర్వకంగా ఈ పదాన్ని సృష్టించాడని చెప్పుకుంటారు. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న LOL, OMG పదాల లాగే ఓల్ కరెక్ట్ అన్న దానికి సంక్షిప్త రూపంగా ఓకేని ఉపయోగించారు. ఆ తర్వాత దీన్నే ఓడబ్ల్యూ గా పిలిచారు. ఓల్ రైట్ అర్థం వచ్చేలా ఓడబ్ల్యూ గా పిలిచారు.

1840 సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ మార్టిన్ వాన్ బ్యూరెన్ యొక్క తిరిగి ఎన్నికల శిబిరంలో ఓకే అనే పదాన్ని ఉపయోగించాడు. అప్పటి నుండి ఇది ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందింది. న్యూయార్క్‌లోని కిండర్‌హూక్‌లో జన్మించిన వాన్ బ్యూరెన్‌కు “ఓల్డ్ కిండర్హూక్” అనే మారుపేరు ఉంది. అతని మద్దతుదారులు ఎన్నికల ప్రచారాల సందర్భంగా ర్యాలీలలో “ఓకే” ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా “ఓకె క్లబ్బులు” సృష్టించారు. ఓల్ కరెక్ట్ అంటూ అర్థం వచ్చేలా దీన్ని వాడారు.

స్థానిక అమెరికన్ భారతీయ తెగ అయిన చోక్తావ్ ఓకే అనే పదం నుండి ప్రస్తుతం ఉన్న ఓకే వచ్చిందని అంటారు. ఇది ఆఫ్రికాలోని వోలోఫ్ భాష నుండి ఉద్భవించిందని కూడా పేర్కొన్నారు. ఇలా ఒక్కో దగ్గర ఒక్కో చరిత్ర ఓకే అనే రెండక్షరాల పదం వెనక ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version