వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి అంకితం చేసిన…

-

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరులో వృద్ధాశ్రమాన్ని నిర్వాహకులు తెరాస ప్రభుత్వానికి అందించారు. ఈ ఆశ్రమాన్ని నిర్మించిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ దంపతులు తెలంగాణ భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను గురువారం సాయంత్రం కలిసి పూర్తి వివరాలు తెలిపారు.  ‘ఎకరన్నర భూమిలో 6 వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితులు సహకరించపోవడంతో భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం గా ఇవ్వడంతో… ప్రభుత్వం తరుఫున నాణమైన సేవలను అందించేలా చూడాలని కేటీఆర్ ని కోరారు.

ఈ విషయమై స్పందించిన కేటీఆర్ ఆ వృద్ధ దంపతుల సేవలను మెచ్చుకున్నారు. నిర్వాహణకు సంబంధించి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో మాట్లాడతానని వారికి హామి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version