రోడ్డు మీద దొరికిన రూ.7,67,000 డబ్బును ఏం చేశాడంటే?

-

మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఓ వంద నోటు దొరికింది. ఏం చేస్తారు. అటూ ఇటూ చూసి.. ఎవరూ అక్కడ లేకుంటే వెంటనే దాన్ని తీసుకొని లటక్కున జేబులో వేసుకొని అక్కడి నుంచి తుర్రుమంటారు. అవునా కాదా. ఓ యువకుడు మాత్రం అలా చేయలేదు. ఆయనకు దోరికింది 100 రూపాయలు కాదు.. ఏకంగా 7,67,000 రూపాయలు దొరికాయి. అంత డబ్బు దొరికాక ఎవ్వరైనా ఏం చేస్తారు.. ఇవాళ నక్క తోక తొక్కి వచ్చాం అనుకొని డబ్బుతో సహా అక్కడి నుంచి జంప్ అయిపోతారు.. అంటారా? మీరు అక్కడే పప్పులో కాలేశారు.

ఆ వ్యక్తి అలా చేయలేదు. రోడ్డు మీద దొరికిన నగదు మూటను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. నగదు మూటలోని ఆధారాలతో డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి వాటిని అందించారు పోలీసులు. ఈ ఘటన యూఏఈలోని అబుదాబిలో చోటు చేసుకున్నది. ఆ వ్యక్తికి రోడ్డు మీద 40 వేల దిర్హమ్స్ దొరికాయి. మన కరెన్సీలో అది 7,67,000 రూపాయలు అవుతుంది. నిజాయతీగా తనకు దొరికిన డబ్బును తీసుకొచ్చి ఇచ్చిన ఆ వ్యక్తిని పోలీసులు సన్మానించి ప్రశంసా పత్రాన్ని ఇచ్చి ఓ గిఫ్ట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version