వామ్మో బామ్మో ..డ్యాన్స్ లో హీరోయిన్ ను మించి పోయావే..

-

మ్యూజిక్ వినిపిస్తే చాలు ఎవరికైనా డ్యాన్స్ చేయాలని అనుకుంటారు.ఈ మధ్య వస్తున్న సాంగ్స్ ముసలి వాళ్ళతో కూడా బ్రేక్ డ్యాన్స్ వేయిస్తున్నాయి.60 ఏళ్ళు దాటితే అయ్యో రామా అని దేవుడికి శేష జీవితాన్ని అంకితం చేస్తారు.ఇది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..బామ్మలు, తాతలు యూత్ కు మేము ఏ మాత్రం తీసిపోము అంటూ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ లు వేస్తున్నారు.మొన్నీమధ్య ఓ తాత డ్యాన్స్ తీన్ మార్ డ్యాన్స్ వేసి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరో భామ్మ కూడా హీరోయిన్ కు తగ్గకుండా స్టెప్పులేసింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పాటలు జనాలను ఎంతగా అలరించాయో ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వచ్చి చాలా రోజులు అయిన కూడా పాటలు ఇంకా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.సామీ సామీ’ అనే పాట ఇంటర్నేషనల్‌ వైడ్‌గా ఫేమస్ అయ్యింది. చాలా దేశాలకు చెందిన ప్రజలు ఆ పాటకు డ్యాన్స్ చేయడం, ఆ డైలాగ్‌ చెబుతూ ఫోజు ఇవ్వడం, పుష్ప సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం వంటివి చేశారు..

తాజాగా మరో వృద్దురాలు కూడా సామి సామి పాటకు, రిమిక్స్ డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను మైమరపిస్తూ.. పుష్ప సినిమాలో రష్మిక మందన డ్యాన్స్‌ను క్రాస్ చేస్తూ దుమ్ము దులిపేసింది.మాస్ స్టెప్పులేసి అందరినీ షాక్ కు గురి చేసింది..చూడటానికి కేజీ కండ కూడా లేని ఆ మహిళ తనదైన స్టైల్‌లో ‘సామీ సామీ’ పాటకు స్టెప్పులేసి సూపర్ అనిపించుకుంది. వయసు కేవలం సంఖ్యకు మాత్రమే, మనసుకు కాదని నిరూపించింది. వృద్ధురాలి డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు ఆ బామ్మ సెలెబ్రిటీ అయిపోయింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version