సంచలనం: 2024 టీ 20 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన ఒమన్ !

-

టీ 20 వరల్డ్ కప్ వచ్చే సంవత్సరం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కు అర్హత సాధించడానికి ప్రపంచ వ్యాప్తంగా చిన్న జట్లు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా ఆసియా నుండి ఇప్పటికే నేపాల్ జట్టు టీ 20 వరల్డ్ కప్ 2024 కు అర్హత సాధించింది. తాజాగా ఇదే ఆసియా క్వాలిఫైర్ సెమీఫైనల్ లో ఈ రోజు కాసేపటి క్రితం బహ్రెయిన్ తో జరిగిన సెమీఫైనల్ లో ఒమన్ జట్టు విజయం సాధించి టీ 20 వరల్డ్ కప్ కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన బహ్రెయిన్ 106 పరుగులకే పరిమితం కాగా, ఒమన్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని కేవలం 14 .2 ఓవర్ లలోనే ఛేదించి వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వచ్చే సంవత్సరం జరగనున్న వరల్డ్ కప్ కు అర్హత సాధించిన జట్టుగా అవతరించింది.

కాగా వరల్డ్ కప్ కు అర్హత సాధించడం గొప్ప విషయమే అయినా.. అందులో అంచనాలకు మించి రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది అని ఇలాంటి చిన్న జట్లు అర్ధం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version