మహారాష్ట్రలో ఓమిక్రాన్ కల్లోలం.. కొత్తగా మరో 2 ఓమిక్రాన్ కేసులు…

-

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా యూకేలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 20 కి చేరింది. దీంతో దేశంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 40కి చేరింది. ఆదివారం ఏపీ, కేరళ, కర్ణాటక, ఛండీగడ్ లతో కొత్తగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ లో 9 కేసులు నమోదయ్యాయి. గుజరాత్, కర్ణాటకల్లో 03 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 2 కేసులు, ఏపీ, కేరళ, ఛండీగడ్ లలో ఒక్కో కేసు నమోదైంది.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓమిక్రాన్ పై హెచ్చరికలు జారీ చేస్తోంది. అనుకున్నదాని కన్నా వేగంగా ఓమిక్రాన్ విస్తరిస్తోందని వెల్లడించింది. వ్యాక్సిన్లకు కూడా లొంగేలా లేదనే అనుమానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచానా వేస్తోంది. మరోవైపు యూకేలో అత్యధికంగా 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశంలో ఓమిక్రాన్ ఎమర్జెన్సీ విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version