గుడ్ న్యూస్ : 4 గంటల్లోనే ఓమిక్రాన్ ఫలితం.. కొత్త టెస్టింగ్ కిట్ ఆవిష్కరించిన ఐసీఎంఆర్

-

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 4 గంటల్లోనే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఫలితాన్ని తేల్చేలా సరికొత్త ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ ను ఆవిష్కరించారు. ఐసీఎంఆర్, టాటా ఎండీ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సరికొత్త కిట్ ను రూపొందించారు. తాజాగా దీనిని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గుర్తించింది. ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ ను కనుక్కునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేస్తున్నారు. దీనికోసం రోజుల తరబడి బాధితులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు 15 వేలలోపే ఉన్న కేసులు గత వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ.. రోజుకు 30 వేలు, 50 వేలకు చేరాయి. రానున్న రోజుల్లో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కవ శాతం ఓమిక్రాన్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీఎంఆర్ తీసుకువచ్చిన కిట్ తో కేవలం 4 గంటల్లోనే ఫలితం రానుంది. దీంతో బాధితులు మరింత తొందరపడే అవకాశం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version