ఢిల్లీలో కొత్తగా మరో 4 ఓమిక్రాన్ కేసులు. .దేశంలో మొత్తంగా 45 కేసులు నమోదు

-

దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఓమిక్రాన్ పట్ల భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఢిల్లీలో కొత్తగా మరో 4 ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లుగా అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఢిల్లీలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది. ఇప్పటికే ఓమిక్రాన్ నుంచి కోలుకుని ఒకరు డిశ్చార్జి అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపాడు. ప్రస్తుతం వచ్చిన 4 కేసులతో కలుపుకుని దేశంలో టోటల్  ఓమిక్రాన్ కేసుల సంఖ్య 45కు చేరింది. ఇవాళ ఒక్క రోజే 5 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4 ఢిల్లీలో నమోదుకాగా.. ఒకటి సూరత్ లో నమోదైంది.

దేశంలో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా మహారాష్ట్రలో అధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 20, రాజస్థాన్ లో 9, ఢిల్లీలో 6, గుజరాత్ లో 3, కర్ణాటకలో 3, కేరళ, చంఢీగడ్, ఏపీల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఓమిక్రాన్ సోకిన వెంటనే.. ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version