తెలంగాణలో కొత్తగా 5 ఓమిక్రాన్ కేసులు… 67కు చేరిన టోటల్ కేసులు

-

ఓమిక్రాన్ కేసులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోని 130 దేశాలకు విస్తరించాయి. భారత్ లోనూ ఓమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత్ తో కేసుల సంఖ్య వెయికి చేరువైంది. తాజాగా తెలంగాణలో కొత్తగా మరో 5 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67కు చేరింది. వీరందరిని ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారి నుంచి 10 మంది కోలుకున్నారు.

రానున్న కాలంలో మరింతగా ఓమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఈరోజు డీహెచ్ శ్రీనివాస రావు హెచ్చరించారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో  కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి 200కి పైగా కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే.. థర్డ్ వేవ్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version