తరచూ మీకు తలనొప్పి వస్తుందా..? తలనొప్పి నుండి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ టిప్స్ ని అనుసరించండి. వెంటనే తల నొప్పి తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి కారణంగా చాలా మంది తలనొప్పి సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య కారణంగా మందులు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కోసారి ఉపశమనం లభించకపోవచ్చు.
అయితే తలనొప్పి సమస్య నుండి బయట పడడానికి మందులు అవసరం లేదు. ఈ జ్యూస్ లని మీరు తీసుకుంటే తప్పకుండా క్షణాల్లో తలనొప్పి సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం.
అరటిపండు మరియు పైనాపిల్ జ్యూస్ :
తల నొప్పిని తగ్గించడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. టెన్షన్ కారణంగా వచ్చిన తలనొప్పి చిటికలో మాయం అయిపోతుంది. మీరు అరటిపండుని పైనాపిల్ ను తీసుకుని మిక్సీలో బ్లెండ్ చేసి పాలు, నట్స్, పంచదార యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు.
క్యారెట్ కీరదోస జ్యూస్:
తలనొప్పి తగ్గడానికి క్యారెట్, కీరా జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది వెంటనే ఉపశమనాన్ని కూడా ఇది ఇస్తుంది.
లెమన్ జ్యూస్:
తలనొప్పి ఎక్కువగా ఉంటే లెమన్ జ్యూస్ ను కూడా మీరు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు వేసుకుని తీసుకుంటే వెంటనే తల నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలానే మైగ్రేన్ సమస్య నుండి కూడా బయటపడవచ్చు.