మీ ఇంట్లో నిత్యం లక్ష్మీ దేవి ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

ఈ విధంగా అనుసరిస్తే ఖచ్చితంగా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా చాలా మంది ఇంట్లో ధనం నిలవదు. దాని వలన ఎంత సంపాదించినా మంచి నీళ్లలాగ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలంటే ఈ చిట్కాలను అనుసరించండి. మరి ఇంక డబ్బు కోసం మీ ఇంట్లో ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో డబ్బు నిలవాలంటే దక్షిణం వైపు కాస్త ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి లేదు అంటే దక్షిణం వైపు ఎత్తు సమానంగా అయినా ఉండాలి. ఇలా వీటిలో ఏదో ఒకటి అనుసరిస్తే తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. అదే విధంగా ఈశాన్య భాగంలో ఉత్తరం వైపు తలుపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా తలుపు ఉండడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది.

అలానే బరువు ఉండే వస్తువులని దక్షిణ నైరుతి వైపు ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బులు వస్తాయి. అలానే పడమర వైపు ఉండే అపార్ట్ మెంట్ లోకి ఇళ్ల పై కూడా లక్ష్మీదేవి ప్రభావం బాగా ఉంటుంది. ఆ దిక్కులో ఇల్లు కట్టుకుంటే డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే నైరుతి వైపు నిర్మించే భారీ నిర్మాణం లోకి పెద్ద భవనం లోకి ఎప్పుడూ డబ్బు ప్రవాహం బాగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో ధనలక్ష్మి మీ ఇంట్లోకి వచ్చేటట్టు చేసుకోవచ్చు. దీనితో ధననష్టం ఆర్థిక ఇబ్బందులు వంటివి ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version