తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగి పోతుంది. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ సోకిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటన చేశారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి ఒమిక్రాన్ రాగా… మిగతావి నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఒమీక్రాన్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఒమిక్రాన్ బాధితుల్లో వ్యాధి లక్షణాలు లేవని.. ఒమిక్రాన్ వల్ల మరణాలు యూకేలో ఒక్కరు తప్ప ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. కానీ ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని పేర్కొన్నారు హెల్త్ డైరెక్టర్. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు.. లాక్ డౌన్ లు ఉండవని తేల్చి చెప్పారు. రెండు డోసుల వాక్సిన్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ వచ్చే అవకాశం ఉందన్నారు.. నిర్లక్ష్యంగా ఉంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని.. తెలంగాణ లో 28 లక్షల మంది సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.