తెలంగాణ రాష్ట్రం లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య క్రమం గా పెరిగి పోతుంది. నిన్న ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇవాళ మరో కేసు నమోదు అయింది. హన్మ కొండ పట్టణానికి చెందిన ఓ మహిళకు ఒమి క్రాన్ వేరియంట్ సోకింది. అయితే.. ఆ మహిళ కూడా విదేశాల నుంచి ఇటీవలే వచ్చినట్లు సమాచారం అందుతోంది. దీంతో వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా.. తెలంగాణ లో నిన్న కొత్తగా నమోదైన 4 ఒమిక్రాన్ కేసులు అయ్యాయి.
ఇందులో ముగ్గురు కెన్యా దేశియులు, ఒకరు దుబాయ్ నుండి వచ్చిన ఇండియన్ ఉన్నట్లు గుర్తించారు. కెన్యా నుండి వచ్చిన ముగ్గురు టోలి చౌకి పార మౌంట్ కాలనీ లో నివాసం ఉంటున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఇండియన్ చార్మినార్ లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ నలుగురిని టీమ్స్ ఆసుపత్రి కి తరలించారు అధికారులు. చార్మినార్ వాసి అయిన దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ట్రీట్మెంట్ కోసం హైదరుగుడా అపోలో ఆసుపత్రి కి పలుమార్లు వెళ్లినట్టు సమాచారం అందుతోంది.