ఇండియాలో 145కు చేరిన కరోనా కేసులు…

-

దేశంలో ఓమిక్రాన్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లు కరోనాతో భమపడుతూ ఉన్న జనాలకు ఓమిక్రాన్ రూపంలో మరో మహమ్మారి రావడంతో భయాందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల రోజూవారీ సంఖ్య 10 వేలకు తగ్గువగానే ఉంటున్నప్పటికీ.. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు ప్రభుత్వాలను, ప్రజలను కలవరపెడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇండియలో కేసుల సంఖ్య డబుల్ కావడం చూస్తే పరిస్థితి  ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దేశంలో ఇప్పటి వరకు 145 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. దేశంలో రాష్ట్రాల వారీగా తీసుకుంటే మహారాష్ట్రలో ఎక్కవ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 48, ఢిల్లీలొ 22, తెలంగాణలో 20, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 17, కేరళలో 11, గుజరాత్ లో 7, యూపీలో 2, ఏపీ 1, తమిళనాడు 1, వెస్ట్ బెంగాల్ 1, చంఢీగడ్ 1 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొత్త ప్రాంతాలకు ఓమిక్రాన్ వ్యాపిస్తుండటం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎయిర్ పోర్టుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఎవరికైనా కరోనా సోకితే .. వెంటనే వారి శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపుతున్నారు. ఓమిక్రానా..కాదా .. అని నిర్థారించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version