శుక్రవారం భారతీయ, రష్యన్ ఉపగ్రహాలు ఒకదానికొకటి దగ్గరకు వచ్చాయని ఇస్రో ప్రకటన చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రష్యా యొక్క భూ పరిశీలన ఉపగ్రహం ‘కనోపస్-వి’కు ప్రమాదకరంగా దగ్గరగా వచ్చింది. ఈ సంఘటన భూమికి సమీపంలో ఉన్న కక్ష్యలో జరిగిందని ఇస్రో చెప్పింది. భారత ఉపగ్రహం రష్యన్ ఉపగ్రహమైన కనోపస్-వికి 224 మీటర్ల దూరంలో ఉందని రష్యా రాష్ట్ర నియంత్రణలో ఉన్న అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది.
రష్య మరియు విదేశీ ఉపగ్రహాల మధ్య కనీస దూరం 224 మీటర్లుగా ఉంది. అయితే, రష్యా ఉపగ్రహం 420 మీటర్ల దూరంలో ఉందని ఇస్రో తెలిపింది. ఇస్రో చీఫ్ కె శివన్ మాట్లాడుతూ… రెండు ఉపగ్రహాలు ఒకదానికొకటి 420 మీటర్ల దూరంలో ఉన్నాయి అన్నారు. మేము నాలుగు రోజులుగా ఉపగ్రహాన్ని ట్రాక్ చేస్తున్నామని ఇది రష్యన్ ఉపగ్రహం నుండి 420 మీటర్ల దూరంలో ఉంది. 150 మీటర్ల దూరం వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది అన్నారు. ఈ సంఘటనలు సర్వ సాధారణం అన్నారు.