ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వారం తిరగకుండానే మరోసారి తూటాలు పేలాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా సరిహద్దు గుజ్జెడికి సమీపంలో కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం. విశాఖ మన్యం సమీపంలో ఈ నెలలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగడం ఇది మూడో సారి.
ఈ నెల 16 న ఒడిశా సరిహద్దుల్లో, ఈ నెల 19న విశాఖ మన్యం గిన్నెలకోట పంచాయతీ లండుల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జులై 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఉన్నందున ఎదురు కాల్పుల ఘటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.