దీపావళి పండుగ రోజున .. మీ దీపం రోజంతా వెలగాలంటే..ఇలా ట్రై చెయ్యండి.

-

మామూలుగా మనం దీపం వెలిగిస్తే ప్రమిద సైజు బట్టి ఓ రెండు లేదా మూడు గంటల్లో దీపం కొండెక్కుతుంది. కానీ ఈ దీపం మనం వాడే మాములు దీపంలా కాదు, రోజంతా వెలుగుతూ ఉంటుంది. ఈ మ్యాజిక్ దీపం ఇలా రోజంతా ఎలా వెలుగుతుందో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా ఈ దీపం బాగా వైరల్ అయింది. ఈ దీపాన్ని చూసినవాళ్లంతా ఇదొక మ్యాజిక్ దీపం అంటున్నారు. ఎందుకంటే, బాగా గాలి వస్తే తప్పా ఈ దీపం ఆరిపోదు. మాటిమాటికీ ఈ దీపాన్ని వెలిగించాల్సిన అవసరం ఉండదు.

ఇకపోతే దీని తయారీకి పెద్ద పెద్ద టెక్నాలజీ కూడా అవసరం లేదు. చాలా సింపుల్‌ ఫార్ములాను వాడి ఈ అద్భుత దీపం తయారుచేశారు అశోక్ చక్రధారి. ఈయన స్వతహాగా కుమ్మరి. ప్రస్తుతం ఈ దీపం తయారీతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు. ఇప్పుడు దేశం మొత్తం ఈ మ్యాజిక్ దీపాలు కావాలని కోరుకుంటున్నారు. చూడటానికి ఇది దీపమే అయినా ఒక చిన్న సైజు లాంతరులా కనిపిస్తుంది. కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇటువంటి దీపాలు కొనుక్కుంటే చాలు మళ్లీ మళ్లీ వాటిని వెలిగించాల్సిన పని ఉండదు. ఈ దీపాలవల్ల మీ ఇల్లంతా కాంతిమయం అవుతుంది.

చక్రధారి, ఛత్తీస్‌గఢ్ కొండగావ్ గ్రామానికి చెందిన ఓ సాధారణ కుమ్మరి. యూట్యూబ్లో ఓ వీడియోను చూసి ఈ మ్యాజిక్ లాంప్ తయారుచేశారు. ఈ దీపం పైన డోమ్ ఆకారంలో ఉన్న రిజర్వాయర్ ‌లో నూనె ఉంటుంది. అది కంటిన్యూగా దీపానికి నూనెను అందిస్తూ, వెలుగుతూనే ఉండేలా చేస్తుంది. మిగిలిన నూనె మరలా తిరిగి డోమ్‌లోకి వెళ్ళటం వాల్ల అదే నూనె పై నుంచి దీప ప్రమిదలో పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల వత్తికి నిరంతరంగా నూనె అందటం వల్ల, దీపం ఆరిపోకుండా రోజంతా వెలుగుతూ ఉంటుంది. రీ-ఫిల్లింగ్ రిజర్వాయర్‌ ను దీపానికి అమర్చటం వల్ల ఇది సాధ్యమైంది అని చక్రధారి తెలిపారు. ఈ దీపం ఎలా పనిచేస్తుందో అని ఓ వీడియోను తీసి ఆయన ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేశారు. గత ఏడాది ఇలాంటి డిజైన్లను దాదాపు 100 దాకా ఛక్రధారి అమ్మారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవ్వటంతో ఇప్పుడు చాలా ఆర్డర్లు వస్తున్నాయి అని చెబుతున్నారు చక్రధారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version