తెలుగు బిగ్ బాస్-4 హోస్ట్ ఎవ‌రంటే.. ఈ సారి ర‌చ్చ రంభోలానే..

-

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమం భారత్ లోనూ అద్వితీయ ప్రాచుర్యం పొందింది. ఆఖరికి ప్రాంతీయ భాషల్లోనూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తయ్యాయి. అయితే ప్ర‌స్తుతం నాలుగో సీజన్ వైపు అడుగులు వేస్తుంది. నాలుగో సీజన్‌ మొదలు కావడానికి 6 నెలలకు పైగానే సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కు నాని, మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. వాస్త‌వానికి చెప్పాలంటే రెండు మూడు సీజన్స్‌తో పోలిస్తే.. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు.

తెలుగు ఆడియన్స్‌కు ఏ మాత్రం తెలియని ఈ రియాల్టీ షోను తన స్టామినాతో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ చేసాడు. ఎన్టీఆర్ రేంజ్‌లో కాకపోయినా.. నాని కూడా బాగానే సక్సెస్ చేసాడు. ఇక మూడో సీజన్ నాగార్జున హోస్ట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. కానీ రెండు సీజన్స్‌తో పోలిస్తే మూడో సీజన్ మాత్రం కచ్చితంగా రేటింగ్స్‌లో చాలా వరకు డౌన్ అయింది. అయితే నాలుగో సీజన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతోంది. బిగ్ బాస్-4 కోసం నిర్వాహకులు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ నే సంప్రదించారని, కళ్లుచెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే సమయానికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా పూర్తవుతుంది. దాంతో ఈ షోకి హోస్ట్ గా చేయడానికి ఎన్టీర్ కు కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ హోస్ట్ అయితే ఆ ఎన‌ర్జీతో ర‌చ్చ రంభోలానే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version