జెఎన్‌యు ఘటనలో కీలక ఫోటోలు బయటపెట్టిన పోలీసులు…!

-

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) క్యాంపస్‌లో గత ఆదివారం జరిగిన దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేసారు. కీలక ఆధారాలు సేకరిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం క్యాంపస్ కాళీగా ఉంది. వైస్-ఛాన్సలర్ ఎం. జగదేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది జెఎన్‌యు విద్యార్థులు గురువారం మండి హౌస్ నుండి హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లారు.

ఇక ఈ దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు వాట్సాప్ గ్రూపులలో దాదాపు 70 మందిని గుర్తించినట్టు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే హెచ్‌ఆర్‌డి కార్యదర్శి అమిత్ ఖరే, జెఎన్‌యుఎస్‌యు ప్రెసిడెంట్ ఐషే ఘోష్, జెఎన్‌యు విద్యార్థులు సాకేత్ మూన్, సతీష్‌లతో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తాజాగా కొన్ని ఫోటోలను విడుదల చేసారు. ఈ ఫోటోలలో పలువురు జేఎన్ యు మాజీ విద్యార్ధులను కూడా పోలీసులు గుర్తించారు. ఇక జెఎన్‌యుఎస్‌యు ప్రెసిడెంట్ ఐషే ఘోష్ కూడా ఆ చిత్రాల్లో ఉండటం ఇప్పుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version