మరోసారి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

-

బిఅర్ఎస్ అసంతృప్తి నేత, మాజీ ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరా నియోజకవర్గం లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో ఎం జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గడిచిన సంవత్సరం నుంచి రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించాలన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించాలనీ కోరుతున్నారు కాని ప్రభుత్వం పట్టించుకోదని విమర్శించారు.

రైతుల రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా? గతంలో కరోనా అన్నారు.. మరి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. చిత్త శుద్ది ఉంటే సెక్రేరియట్ కట్టే కంటే రైతుల కోసం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. నేను అస్తి పరున్ని కాదు, నాకు వేల ఎకరాల మామిడి తోట ఉందని దాడులు చేయించారని… నాకు మామిడి తోటలు లేవని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version