విజయ్ వర్మ వాలెంటైన్స్ డే పోస్టులో ఉన్నది తమన్నానే.. అసలు విషయాన్ని బయటపెట్టిన నెటిజన్లు..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ లవ్ లో ఉన్నారంటూ కొన్ని రోజుల నుంచి రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తున్న ఇప్పటికి ఎలాంటి సమాచారం లేదు. అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా విజయ్ షేర్ చేసిన ఒక ఫోటో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫామ్ అయిపోయింది..

గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్ వీడియో బయటపడటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరికీ అర్థం అయిపోయింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒకటి రెండు సార్లు బయట జంటగా కనిపిస్తూ వచ్చారు. ప్రేమికుల రోజు సందర్భంగా వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా చెబుతారు అని అనుకుంటే అలా జరగలేదు.. కానీ విజయ్ మాత్రం ప్రత్యేక పోస్ట్ ను పంచుకున్నాడు. అయితే ఈ పోస్టులో వీరిద్దరూ ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాడు. కానీ ఇది చూసిన అభిమానులంతా కొంచెం బుర్రకు పదును పెట్టి అసలు విషయాన్ని బయట పెట్టేశారు..

 

ప్రేమికుల రోజు సందర్భంగా విజయ్ పెట్టిన పోస్ట్ లో పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆరా తీసిన నెటిజన్లు ఆ ఫొటో తమన్నాదేనని తేల్చేశారు. ఎలా అంటే విజయ్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రెడ్ హార్ట్ ఎమోజితో ఉన్న ఒక చిత్రాన్ని షేర్ చేశాడు. ఇందులో రెండు జతల పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. కానీ ఫేస్‌లు మాత్రం కనిపించలేదు. అయితే విజయ్ షేర్ చేసిన పిక్‌లో తమన్నా జాకెట్ కనిపించింది. కానీ ఆ జాకెట్ తమన్నాదేనని గ్యారంటీ లేదు కదా అనే సందేహం రావచ్చు. అయితే అదే జాకెట్‌ను పట్టుకుని ఉన్న తమన్నా వేరొక పిక్‌ను వెతికి పట్టుకున్నారు.. ఈ రెండు చిత్రాలను కంపేర్ చేస్తూ విజయ్ వాలెంటైన్స్ డే పోస్టులో ఉన్నది తమన్నానే అని కన్‌ఫర్మ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version