తుంగభద్ర డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం.. నిపుణుల హెచ్చరిక!

-

ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండుకుంది. దీంతో వరదల ఉధృతంగా రావడంతో డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ గేటు వద్ద స్టాప్‌లాక్ గేట్లను విజయవంతంగా అమర్చారు. అయితే, ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు మాత్రమేని డ్యామ్ నిపుణుల కమిటీ స్పష్టంచేసింది.

ఇప్పటికే ఆ గేట్లను 25 ఏళ్ల పాటు వినియోగించారని పేర్కొన్నారు.గేట్లను ఇకమీదట మార్చకపోతే ప్రమాదం పెను ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు.దీంతో తాజాగా తుంగభద్ర డ్యామ్ నిపుణుల బృందం మరో కీలక హెచ్చరిక చేసింది. డ్యామ్ 22వ గేటు దిగువ భాగాన భారీ గొయ్యి ఏర్పడిందని తేల్చారు.ఆ గొయ్యి వలన రిజర్వాయర్ పునాదులు దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించారు. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు పార్కులో బోటింట్ కోసం ఏర్పాటు చేసిన సరస్సు తూముల నుంచి లీకేజీ ఏర్పడిందని తెలిపారు. అది కూడా డ్యామ్‌కు డ్యామేజ్ చేయవచ్చునని, కొంతకాలంలో డ్యామ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణుల కమిటీ సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version