మరొకసారి పుష్ప -2 సినిమా షూటింగ్ వాయిదా.. నిజమేనా..?

-

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా పేరుపొందారు అల్లు అర్జున్. పుష్ప -2 సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో పుష్ప-2 సినిమా పైన భారీ అంచనాలను పెంచేస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ -2 ని మరింత ప్రత్యేకతలతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ముందు అనుకున్న కథలో భారీ మార్పులను చేసి ఫైనల్ గా ఇటీవలే సినిమా స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా సినిమా బడ్జెట్ నుంచి ఆర్టిస్టుల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సుకుమార్ తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా రష్మీక నటిస్తోంది.ముఖ్యంగా మొదటి భాగానికి మించి అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు సుకుమార్. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా దీపావళి పండుగ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ప్రచారం జరిగింది.

కానీ ఇది కూడా నిజం కాలేకపోయింది. తాజాగా నవంబర్లో ప్రారంభం కాబోతోందని ఇందుకోసం ప్రత్యేక డేట్ ను కూడా మేకర్స్ లాక్ చేశారనే విషయం వైరల్ గా మారుతోంది. గత కొన్ని నెలలుగా వరుసగా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మరొకసారి వాయిదా పడడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ 7వ తేదీన మొదలుపెట్టాలని సుకుమార్ తో పాటు మేకర్స్ భావించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాంకాంగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో కూడా ఈ సినిమా షెడ్యూల్స్ పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news