జుంబా డ్యాన్స్‌ పేరుతో అమ్మాయిలకు వల..!

-

జుంబా డ్యాన్స్ పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లో చిరంజీవి జుంబా డ్యాన్స్‌ పేరుతో ఓ అకాడమీని ప్రారంభించాడు. ఆ డ్యాన్స్ చేస్తూ బరువు తగ్గుతారని, ఆకర్షణీయమైన శరీరం సౌష్ఠవాన్ని సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం చేశాడు. జుంబా డ్యాన్స్ నేర్పిస్తానంటూ మొదలైన ఆ మోసగాడి దగాతో చాలామంది యువతులు మాయలో పడ్డారు. దీంతో సైబరాబాద్ షీ టీమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో చిరంజీవి డ్యాన్స్ పేరుతో అనేక మందిపై లైంగిక వేధింపులకు గురిచేసేవాడనీ.. కానీ, ఎవ్వరూ బైటపెట్టలేదు.

zumba dance

ఈ క్రమంలో డ్యాన్స్ క్లాసులకు వచ్చిన యువతులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్న సందర్భంలో డబ్బుల విషయం బైటపడింది. కానీ అప్పటికే వారు డబ్బులు ఇవ్వటంతో చిరంజీవి లైంగిక వేధింపులకు పాల్పడినా కిక్కురుమనలేదు. దీని గురించి మాట్లాడితే తమ డబ్బులు ఎక్కడ ఇవ్వడోనని భయపడ్డారు. చిరవరకు చిరంజీవి మోసం బైటపడటంతో తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు చిరంజీవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version