‘‘ఒక్క రోజు కలెక్టర్ పదవి’’.. ఒకే ఒక్కడు సినిమా తరహాలో !

-

దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఒకే ఒక్కడు’’ సి నిమా గుర్తుకే ఉంటుంది మీకు. అర్జున్ హీరోగా, రఘువరన్ విలన్ గా నటించి సూపర్ హిట్ మూవీ. ఈ సినిమాలో రఘువరన్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తాడు. అర్జున్ రిపోర్టర్ గా ఉంటాడు. ఒక్క రోజూ సీఎం పదివిని చేపట్టి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు తీసుకోస్తాడు హీరో..

collecter

ఇదే తరహాలో ఓ జిల్లా కలెక్టర్ ‘ఒకే ఒక్కడు’ సినిమాను గుర్తుకు తెస్తున్నాడు. ఆ కలెక్టర్ పేరు పోలా భాస్కర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్న పోలా భాస్కర్ జిల్లా వాసులకు బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. ఒకే ఒక్కడు సినిమా తరహాలో తన పదవిలో ఒక్కరోజు ఉండి చూడండి అంటూ బహిరంగంగా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ సినిమాలో ఒక్కరోజు సీఎం కొనసాగితే మీరు ఒక్కరోజు కలెక్టర్ పదవిలో ఉండి చూడండి అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది.ఒంగోలు జిల్లాలో కలెక్టర్ ఇటీవల జిల్లా వర్తకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోందని, కోవిడ్-19ను తనకంటే మంచిగా కట్టడి చేసేవారుంటే వారికి ఒక రోజు జిల్లా పాలనాధికారిగా నియమిస్తానని చెప్పుకొచ్చారు.

కరోనా కష్టకాలంలో కలెక్టర్ గా పనిచేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి కరోనా కట్టడికి పూర్తి సాయం అందుతుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లోద్దని, వెళ్లినా మాస్కులు, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ఉండొద్దన్నారు. సామాజిక దూరం పాటించాలన్నారు. వన్ డే కలెక్టర్ గా చేసిన వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాఫిగా మారింది. ఆయన మాట్లాడిన మాటలకు పలువులు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరస్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version