ఏభై శాతం పైగా ఓట్లతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన జగన్… అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ఫస్ట్ ఇయర్ ని సక్సెస్ ఫుల్ గా బ్యాక్ లగ్స్ ఏమీ లేకుండా డిస్టింక్షన్ మార్కులతో పాసయ్యారు. ఈ క్రమంలో అంతా బాగానే ఉంది కానీ… కమ్మ సామాజిక వర్గం నుంచి మాత్రం జగన్ కు దూరమవుతూనే ఉందని.. గత ఏడాదికాలంగా ప్రభుత్వంలో జరిగిన పరిణామాలే అందుకు సాక్ష్యం అని అంటున్నారట! దీంతో జగన్ ఒక కమ్మని కబురు చెప్పబోతున్నారని అంటున్నారు!
వివరాల్లోకి వెళ్తే… అన్ని సామాజికవర్గాలలోనూ మెజారిటీ ప్రజలు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా… కమ్మ సామాజిక వర్గం మాత్రం అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దానికి కారణం సంక్షేమ పథకాల్లో వారికి అన్యాయం జరిగిందని కాదు సుమా… ప్రభుత్వంలోని పెద్ద తలకాయల్లో కమ్మవారికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఒకటి కాగా… ఆ సామాజిక వర్గం అని తెలిస్తే చాలు సైడ్ చేసేస్తున్నారని గాసిప్స్ రావడం! ఇదే క్రమంలో అమరావతిని తరలించడం కూడా కమ్మ సామాజికవర్గంపై దాడిగానే టీడీపీ నేతలు చిత్రీకరించిన నేపథ్యంలో… ఆ విమర్శనుంచి తప్పించుకునే క్రమంలో.. జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది!
తన కేబినెట్ లో ఇప్పటికే ఆ సమాజికవర్గానికి చెందిన కొడాలి నానీకి జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో నానీ తోపాటు అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఇచ్చేలా జగన్ ఆలోచిస్తున్నారంట. అలాగే… నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి సముచిత స్థానం కట్టబెట్టాలని చూస్తున్నారట జగన్. ఫలితంగా ఇకపై అయినా జగన్ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకి కాదని నిరూపించుకోదలచారని అంటున్నారు!! ఇదే నిజమైతే… బాబు కు ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!