మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా..? అయితే లక్ష లోన్ ని ఇలా పొందండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఇ-ముద్రా పథకం ద్వారా వేగంగా చిన్న మొత్తాల్లో లోన్స్ ని స్టేట్ బ్యాంక్ అందిస్తోంది. పూర్తి వివరాలు చూస్తే.. లోన్ కావాల్సిన వారు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే డబ్బులు ని పొందవచ్చు. మైక్రో ఎంట్రప్రెన్యూర్ అయిన వాళ్లకి లోన్ వస్తుంది. బ్యాంక్‌లో మీకు కరెంట్ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ ఉండాలి.

అకౌంట్ ని ఓపెన్ చేసి కనీసం 6 నెలలు అయినా అయ్యి ఉండాలి. ఇ-ముద్రా లోన్స్ కింద గరిష్టంగా రూ. లక్ష వరకు లోన్ ని తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ 5 సంవత్సరాల లోగా తిరిగి పే చెయ్యాల్సి ఉంది. లోన్ రూ.50 వేలలోపు ఉంటే ఆన్‌లైన్‌లోనే ఈ లోన్ డబ్బులు పడతాయి. రూ. 50 వేలు దాటితే మాత్రం బ్యాంక్‌ కి వెళ్ళాలి.

ఖాతా నంబర్, బిజినెస్ ప్రూఫ్, ఆధార్ నంబర్, కమ్యూనిటీ వివరాల తో పాటు జీఎస్‌టీఎన్, యూడీవైఓజీ ఆధార్ సమాచారం, షాప్ అడ్రస్, బిజినెస్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలి. ఇలా లోన్ కింద రూ. 1 లక్ష వరకు పొందవచ్చు. టెన్యూర్ కూడా ఐదేళ్ల వరకు పెట్టుకోవచ్చు. కానీ టెన్యూర్ పెరిగే కొద్ది వడ్డీ భారం కూడా పెరుగుతుంది. ఎస్‌బీఐ ముద్రా లోన్ స్కీమ్ కింద గరిష్టంగా రూ. 10 లక్షల వరకు లోన్ ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version