ఏపీ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన హైకోర్టు !

-

ఏపీలో హైకోర్టు vs ప్రభుత్వం అన్నట్టు మారింది పరిస్థితి. ఏపీ ప్రభుత్వం చేసే ప్రతి అంశంలో ఏమాత్రం అవకాశం ఉన్నా హైకోర్టు తప్పు పడుతూనే ఉంది. మరి లీగాలిటీస్ చూసుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళుతుందో లేక ఇంకేమో కానీ వారానికి ఒక సారయినా ప్రభుత్వం చేసే ఏదో ఒక దానికి హైకోర్టు బ్రేకులు వేస్తోంది. తాజాగా ఆలయ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

విజయనగరం జిల్లా గుంపం గ్రామంలో ఆలయ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు దేవాలయ భూమిని సిద్ధం చేస్తున్నారని హైకోర్ట్ ను ఆశ్రయించారు గుంపం గ్రామస్తులు. ఈ రోజు ఈ కేసు హైకోర్ట్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆలయ భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చే నిబంధన ఎక్కడ ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version