సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి… సుశాంత్ కి డ్రగ్స్ సప్లై చేసింది అనే ఆరోపణలతో అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రియా చక్రవర్తి ని నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. ఇక ఈ విచారణకు సంబంధించి బాలీవుడ్ లో ఎన్నో వార్తలు కూడా హాల్ చేస్తూనే ఉన్నాయి. ఎంతో మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇక తాజాగా రియా చక్రవర్తి కి మరో భారీ షాక్ తగిలింది. రియా చక్రవర్తి జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు గా ఎన్డిపీఎస్ చట్టం ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించండి. దీంతో తనకు కాస్త విముక్తి లభిస్తుంది అనుకున్న రియా చక్రవర్తి మళ్లీ షాక్ తగిలింది. అయితే సెప్టెంబర్ 8న రియా ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించగా… ఇక ఇప్పుడు మరో సారి తనకు కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రత్యేక కోర్టు.