బెంగాల్ లో వారం రోజులు స్కూళ్లు, కాలేజీల మూసివేత… కారణం ఇదే

-

 

“తీవ్రమైన” హీట్‌వేవ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను వచ్చే వారం మూసివేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం తెలిపారు. గత కొన్ని రోజులుగా పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలు తలనొప్పి మరియు ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారని బెనర్జీ చెప్పారు. “తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యా సంస్థలు సోమవారం నుండి వచ్చే వారం శనివారం వరకు మూసివేయబడతాయి. “ఈ కాలంలో ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా అలాగే చేయాలని నేను కోరుతున్నాను” అని బెనర్జీ బెంగాలీ న్యూస్ ఛానెల్‌తో అన్నారు.

 

దీనికి సంబంధించి త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. “మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నాను” అని ఆమె చెప్పారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వేసవి సెలవులను కొండ ప్రాంతాలు మినహాయించి, ఎండ వేడిమి కారణంగా మే 2 వరకు మూడు వారాల పాటు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు ముందస్తుగా ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version