లాటరీలో 16 కోట్ల ఔషధం గెలిచింది.. చిన్నారి ప్రాణం నిలిచింది

-

లాటరీలో 16 కోట్ల ఔషధం గెలిచింది ఓ చిన్నారి. దీంతో ఆ చిన్నారి ప్రాణం నిలిచింది. అదేంటి 16 కోట్ల ఔషధం ఏంటి..లాటరీలో డబ్బులు రావాలి కాదా అనుకుంటున్నారా! అవును ఆ చిన్నారి..లాటరీలో 16 కోట్ల ఔషధం గెలిచింది. అసలు వివరాల్లోకి వెళితే… స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ (ఎస్ఎంఏ).. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి పెరిగే కొద్దీ ఆ పిల్లల వెన్ను వంగి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది.

ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఒకే ఒక మందు ఉంది. అది చిన్న తనంలోనే వెయ్యాలి. కానీ దాని ధర ఏకంగా 16 కోట్లు. ఈ వ్యాధి డబ్బులు ఉన్న వాళ్లకు వస్తే పర్వాలేదు కానీ సామాన్యులకు వస్తే ఇక ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి ఉందే. అయితే… తాజాగా ఈ వ్యాధి సోకిన చిన్నారి లాటరీలో ఆ 16 కోట్ల ఔషధం గెలిచింది.

ఏడాది జైనబ్ అనే చిన్నారి ఎస్ఎంఏ వ్యాధి సోకింది. ఈ పాప స్వస్థలం కోయంబత్తూరు. ఈ నేపథ్యంలో క్యూర్ ఎస్ఎంఏ అనే స్వఛ్చంద సంస్థ రూపొందించిన లాటరీ డ్రాలో జైనబ్‌ పేరు నమోదు చేశారు కోయంబత్తూరుకు చెందిన తండ్రి అబ్దుల్లా. అయితే… అంతకుముందే ఎస్ఎంఏ వ్యాధితో అబ్దుల్లా మొదటి సంతానం మృతి చెందింది. దీంతో ముందు జాగ్రత్తగా క్యూర్ ఎస్ఎంఏ అనే స్వఛ్చంద సంస్థ రూపొందించిన లాటరీలో పేరు నమోదు చేశాడు.

అదృష్టవశాత్తు… నిన్న తీసిన లాటరీ లక్కీ డ్రాలో జైనబ్ తో పాటు మరో ముగ్గురు చిన్నారులకూ ఔషధం లభించింది. దీంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో జైనబ్ కు ఆ 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ వేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news