‘దేశముదురు’ సినిమాలో స్వామిజీగా ఉన్న అలీ తన ఫ్లాష్‌బ్యాక్ చెబుతున్నప్పుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో పొరపాటున పాకిస్థాన్ బార్డర్‌లోకి ప్రవేశిస్తాడు. ఇదే తరహా రాజస్థాన్‌కు చెందిన ఓ యువడుకు భారత సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో భూభాగంలోకి అడుగు పెట్టాడు.
ఈ ఘటన నవంబర్‌లో జరిగినా గురువారం ఆ యువకుడిని భారతదేశానికి తీసుకురావాలని బీజేపీ నాయకులు జిల్లా కలేక్టర్‌ను కలవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. భారత్–పాక్ సరిహద్దులోని కుంహారో కా టిబ్బా ప్రాంతంలో నివాసిస్తున్న గెమ్రా రామ్‌మేఘ్‌వాల్ (19) అనే యువకుడు, గతేడాది నవంబర్‌లో తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పటికే బయటున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు హఠాత్తుగా ఇంటికి రావడంతో వారికి కనబడకుండా తప్పించేకుని బయటపడ్డాడు.
సింద్ పోలీసుల అదుపులో..?
ఆ తర్వాత పారిపోతూ..పోతూ సరిహద్దుదాటి పాకిస్థాన్‌లోకి అడుగు పెట్టాడు. సరిహదులో కాపాల ఉండే పాకిస్థాన్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసినట్లు రాజస్థాన్ పోలీసులకు సమాచారం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు తమ అబ్బాయిని ఎంత ఇబ్బందులకు గురిచేస్తున్నారో అని ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఓ అధికారి ఈ కేసును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ రెంజర్లతో పలుమార్లు చర్చించిన తర్వాత ఆ యువకుడు సిం«ద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు పూర్తిచేసి స్వదేశానికి అప్పగించనున్నట్లు వారు పేర్కొన్నారు.