ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులుగా కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312,0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ 309.6546 టీఎంసీలకు చేరుకుంది.
ఇన్ ఫ్లో 1,74,609 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,6,664 చూసి ఎక్కడ నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. 18 క్రస్ట్ గేట్లను ఎత్తి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.