శ్రీశైలం జలాశయం కు జలకల సంతరించుకుంది. ఇప్పటికే నెల రోజులకు పైగా కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైలం డ్యాం కు చేరుకుంటుంది. దీంతో జలాశయం పూర్తిగా నిండిపోగా.. డ్యాం కు చెందిన 2 గేట్లను ఎత్తి దిగువ సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,42,181 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1,17,912 క్యూసెక్కులు గా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884.80 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిలువ 215.8070 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 214.3637 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిి కొనసాగుతోంది.