సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు..ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం. అన్యోన్యంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్న వారు కూడా ఆ తర్వాత విడిపోవడం.. లేదా మానసికక్షోభకు గురి అవ్వడం.. చివరికి ప్రాణాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. నిజానికి సెలబ్రిటీల జీవితాలు అంటే ఖరీదైన బట్టలు, కాస్ట్లీ వస్తువులు, లగ్జరీ లైఫ్ ఇలా ఎంతో అందంగా బయట ప్రపంచానికి కనిపిస్తూ ఉంటుంది. కానీ సామాన్య వ్యక్తికైనా సెలబ్రిటీలకైనా సమస్యలు అనేవి ఒకటే ఉంటాయి. అందుకే కొంతమంది సెలబ్రిటీలు వారి స్థాయిని , హోదాని మరిచిపోయి సాధారణ వ్యక్తుల లాగే కష్టాలుతట్టుకోలేక ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు.. ఇక వారు ఎవరెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఉదయ్ కిరణ్:
చేసింది కొన్ని సినిమాలే అయినా చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఏకైక యంగ్ హీరో ఉదయ్ కిరణ్ అని చెప్పవచ్చు. నిజానికి ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కొంతమంది చిరంజీవి కుటుంబం కారణమని చెబుతూ ఉంటారు. కానీ బయట ప్రపంచానికి తెలియని మరో విశేషమేమిటంటే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు తన చేతిలో రెండు తమిళ్ సినిమాలు ఉన్నాయి.. ఒకవేళ తెలుగులో సెటిల్ కాకపోతే తమిళ్ సినిమాలలో సెటిల్ అయ్యేవాడు కానీ అతడు చనిపోవడానికి రెండు రోజుల ముందు నుంచి తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యాడట. ఒకవైపు కుటుంబ కలహాలు మరొకవైపు ఆర్థిక నష్టం కారణంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
చక్రి: