ఉల్లి లొల్లికి చెక్ పెట్ట‌నున్న ఏపీ స‌ర్కార్‌..

-

ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో సతమతమవుతున్న ఏపీలోని వినియోగదారులకు గుడ్ న్యూస్‌. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్నఉల్లి ధరలు ఏపీలో తగ్గు ముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో ఉల్లి ధరలు దిగివచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.150లకు చేరిన నేపథ్యంలో ధరల అదుపునకు ఏపీ సర్కారు చికిత్స మొదలు పెట్టడంతో ప్రయోజనం కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర అవసరాలు తీరకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో దాని ప్రభావం మార్కెట్ పై కనిపిస్తోంది.

కర్నూలులో ఒక దశలో క్వింటాల్ ఉల్లి ధర 12 వేల రూపాయలు దాటింది. అటువంటిది ఈ రోజు 8,600 పలికింది. పలుచోట్ల లారీలతో తరలిపోతున్న ఉల్లిని కూడా అధికారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉల్లి నిల్వలు పెరిగి మార్కెట్ కు అందుబాటులోకి రానున్నాయి. దీంతో డిమాండ్ మేరకు సరఫరా పెరిగితే ధర తగ్గుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version