హెల్మెట్లు పెట్టుకుని మ‌రీ ఉల్లి అమ్మ‌కాలు.. ఎక్క‌డంటే..?

-

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు అదే ఉల్లి కొయ్య‌కుండానే ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. కిలో రూ.110 పలుకుతుండటంతో ఉల్లి లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. ఏడాదికోసారి ఉల్లి ఇలా కొండెక్కి కూర్చుంటుండటం సామాన్యులను గుదిబండగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రలో ప్రభుత్వం చోరవ చూపడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో రూ.100 రూ. 120 వరకూ ఉంటున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఉల్లి ధరలు 100 నుంచి 500 రూపాయలు ఉంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఉల్లిగడ్డలు కొనాలంటేనే బెంబేలేత్తిపోతున్నారు.ఈ నేపథ్యంలో ఉల్లిపై బీహార్ ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తోంది. కిలో రూ.35కి ఉల్లిగడ్డను విక్రయిస్తోంది.

బీహార్ స్టేట్ కార్పోరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ఉల్లిగడ్డలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని అందజేస్తోందని తెలియగానే..జనం కౌంటర్ల వద్దకు క్యూ కట్టారు. భారీగా జనం పోటెత్తడంతో ఉల్లి విక్రయదారులు అప్రమత్తమయ్యారు. జనాలు భారీ సంఖ్యలు వస్తున్న ప్రభుత్వం తమను భద్రత ఏర్పాటు చేయలేదని విక్రేతలువాపోతున్నారు. జనాలను చూసి అధికారులు హెల్మెట్లు పెట్టుకొని ఉల్లిగడ్డను విక్రయిస్తున్నారు. ఉల్లి కోసం జనం రాళ్లతో దాడి చేయడం వాహనాలపైకి ఎక్కి ఎగబడతారని. ముందస్తుగా హెల్మెట్లు ధరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version