మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్

-

ఆన్‌లైన్ బెట్టింగులు మరో యువకుడి ప్రాణాలు తీశాయి. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

జిల్లాకు చెందిన జైచంద్ర రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దని షర్ట్‌పై రాసుకున్నాడు. మృతుడిది పరిగి మండలం పైరేట్ గ్రామంగా గుర్తించారు. బెట్టింగ్‌తో తీవ్రంగా నష్టపోయిన జై చంద్ర ఇంట్లో ఈ విషయం చెప్పకుండా ఆత్మహత్య చేసుకుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news