ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ హీరో ల పాలిట శాపం గా మారింది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ లో సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లు ను ప్రవేశ పెట్టారు. దీని వల్ల ఏ సినిమా అయినా.. రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ఉండనున్నాయి. బెన్ ఫిట్ షో ల పై పూర్తి గా నిషేధం విధించారు. దీని వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలు తీవ్రంగా నష్టపొనున్నారు.
ఇప్పటి వరకు కోట్ల ల్లో రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల నిర్మాత లకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు రాకపోవచ్చు. దీంతో హీరోల పారితోషికాలు గణనీయం గా తగ్గే అవకాశం ఉండనుంది. అయితే ఈ ఆన్‌లైన్ టికెట్స్ పై ఇప్పటి కే పలువురు సినిమా ఇండస్ట్రీ పెద్దలు.. సినిమా హీరోలు వ్యతిరేకించారు. ముఖ్యం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు. అలాగే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో నందమూరి హీరోలు కూడా పెదవి కదుపుతున్నారు.
దీంతో తనకు ప్రత్యర్థి గా ఉన్న హీరోలు అందరి పై చెక్ పెట్టడానికి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అని పలువురు భావిస్తున్నారు. కాగ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా అలాగే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అఖండ సినిమాలు విడుదల కు సిద్ధం అవుతున్నాయి. ఈ హీరో లకు చెక్ పెట్టడానికే.. వారి సినిమాలు విడుదల అయ్యే సమయంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.