మాములుగా అయితే శాకాహార భోజనానికి ఈ రోజుల్లో కనీసం రూ. 100 లేనిదే దొరకదు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ వద్ద బిర్యానీ కేవలం రూ.10కే లభిస్తుంది. ఆశ్చర్యపోకండి. నమ్మండి నేను చెప్పేది నిజం! స్మాల్ బిర్యానీ కనీసం రూ.100 కంటే తక్కువ లేదు. మరి అక్కడ రూ.10కే ఎలా ఇస్తున్నారు. ఇదెలా సాధ్యం? ఎక్కడ అమ్ముతున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ ఏరియా ఈ స్టాల్ పేరు చెప్పి అడ్రెస్ అడిగితే చూపిస్తారు. చూడ్డానికి పాత హోటల్‌లా ఉంటుంది. పదేళ్ల నాటిది. రోజంతా ప్లేట్ బిర్యానీని రూ.10కే అక్కడ అమ్ముతున్నారు. ఉదయం 7 గంటలకే తెరిచి..రాత్రి వరకూ అందుబాటులో ఉంచుతారు. పేదవాళ్లు, రోజువారీ కూలీలకు ఈ హోటల్ ప్రాణం పోస్తోంది. దగ్గర్లోనే కాదు అటువైపుగా వెళ్లేవారు, ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆకలి కాగానే ఈ బిర్యానీ సెంటర్‌లో వాలిపోతున్నారు. అసలు ఈ యజమాని రూ.10 కే బిర్యానీ విక్రయించడంలో ఆంతర్యమేంటో తెలుసుకుందాం.
తలాబ్ కట్ట దగ్గర నివసిస్తున్న ఇఫ్తికార్ మొమిన్ పది సంవత్సరాల కిందట ఈ ఫుడ్ స్టాల్‌ను చిన్నగా ప్రారంభించారు. అప్పట్లో ఇదే వెజ్ బిర్యానీని రూ.5 చొప్పున అమ్మారు. ధరలు పెరుగుతుంటే… ఆయన కూడా కాస్త పెంచుతూ ప్రస్తుతం రూ.10 చేశారు. ఇలాంటి స్టాల్స్‌ని ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రారంభించి నడిపిస్తున్నారు.
రూ.10 అనగానే బిర్యానీ ఏ నాసిరకం బిర్యానీ యో అనుకోకండి… ప్లేట్‌లో రైస్‌తోపాటూ… ఒకటి లేదా 2 రకాల కర్రీలు కూడా ఇస్తారు. వాటిలో బఠాణీలు, క్యారెట్లు, బంగాళాదుంపలుఉంటాయి. ఈ స్టాళ్లలో పేట్ రూ.10తోపాటూ… అరకేజీ బిర్యానీని రూ.30, కేజీ బిర్యానీని రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ తినటానికే కాదు. ఇక్కడి నుంచి పార్సిల్ కూడా తీసుకెళ్తారు, ఈ హోటల్‌కు పార్సిల్ సౌకర్యం కూడా ఉంది.
మొదట్లో ఇఫ్తికార్ గమనించినప్పుడు తక్కువ ధరకు మీల్స్ దొరకట్లేదని తెలుసుకున్నారు. అందుకే తాను తక్కువ ధరకు అమ్మాలని ఇది ప్రారంభించారు. లాభాలు సాధించడం మా ఉద్దేశం కాదు‘ అని ఇఫ్తికార్ సోదరుడు అసద్ తెలిపారు.
అఫ్జల్‌గంజ్‌లోని స్టాల్… రోజూ 1500 ప్లేట్లకి తక్కువ కాకుండా బిర్యానీ అమ్ముడవుతోంది. ఒక్కో ప్లేట్‌కీ రూ.1 లాభం వేసుకుంటోంది. రోజూ నాలుగు పెద్ద వంటపాత్రల్లో 60 కేజీల బిర్యానీ తయారుచేస్తున్నారు. ఇదీ ఇఫ్తీకార్ ఏర్పాటు చేసిన బిర్యానీ సెంటర్ ఇప్పుడు నగరం నలుమూలలా విస్తరించి అన్నార్థుల ఆకలి తీరుస్తుంది. నాణ్యతకు కొరవ లేకుండా ఈ వెజ్ బిర్యానీ అందుబాటులో ఉంది.